‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ టైటిల్ ఓకే కానీ.. కథ అదేనా!

  • March 1, 2023 / 05:37 PM IST

అనుష్క శెట్టి.. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుంది.. పాండమిక్ కారణంగా ఓటీటీలో రిలీజ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఈ లెక్కన ఫ్యాన్స్, ఆడియన్స్ స్వీటీని సిల్వర్ స్క్రీన్ మీద చూసి 5 ఏళ్లు పైనే అయింది.. అందులోనూ ఈమధ్య కాస్త బరువు పెరిగి కనిపించడంతో ఇక సినిమాలు చేయదేమోనని షాక్ అయ్యారు ఫ్యాన్స్.. కట్ చేస్తే.. అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ అప్‌డేట్‌తో కాస్త రిలీఫ్ ఇచ్చారు టీం..

అనుష్క, యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో.. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్‌లో వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్.. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’.. గతకొద్ది రోజులుగా ప్రచారంలో పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేస్తూ.. అనుష్క – నవీన్ లుక్స్ రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు..

పోస్టర్లో ‘హ్యాపీ సింగిల్’ అనే బుక్ పట్టుకుని మిస్ శెట్టి, రెడీ టు మింగిలి అని రాసున్న టీషర్ట్ వేసుకుని మిస్టర్ పొలిశెట్టి కనిపించడం ఆసక్తికరంగా అనిపిస్తోంది.. ఈ కథ గురించి సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్లలో వార్తలొచ్చాయి.. పెళ్లీడు దాటిన నడివయస్సు మహిళ ఓ యువకుడి మధ్య రిలేషన్ నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం.. అనుష్క ఓకే చేసిందంటే కచ్చితంగా కాన్సెప్ట్‌లో మేటర్ ఉండే ఉంటది.. తమిళ్, తెలుగులో తెరకెక్కిస్తున్న ఈ మూవీని సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు..

అనుష్క నటిస్తున్న 48వ సినిమా ఇది.. హీరోగా నవీన్ పొలిశెట్టికి మూడో చిత్రం. అంటే, 47 సినిమాల అనుభవం కలిగిన హీరోయిన్‌తో రెండు సినిమాల హీరో నవీన్ పొలిశెట్టి క్రేజీ కాంబినేషన్ యూవీ క్రియేషన్స్ భలే సెట్ చేసింది. టైటిల్, పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమా మీద అంచనాలు పెరిగాయి.. రథన్ సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus