Anushka, Kohli: స్పెషల్ డే గుడ్ న్యూస్ చెప్పబోతున్న అనుష్క?

  • September 30, 2023 / 04:48 PM IST

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలీవుడ్ నటి అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్నారు. ఈ విధంగా 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు పెళ్లి తర్వాత అనుష్క కొన్ని సినిమాలలో నటించిన ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇక అనుష్క (Anushka) విరాట్ కోహ్లీ 2021వ సంవత్సరంలో తల్లిదండ్రులుగా మారారు. ఏడాదిలో అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి వామిక అని నామకరణం చేశారు. ఇలా విరాట్ కోహ్లీ అనుష్కలకు కూతురు జన్మించినప్పటికీ ఇప్పటివరకు తన కూతురి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. తరచూ తన కూతురితో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసిన ఎక్కడా కూడా తన కుమార్తె ఫేస్ కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.

ఇలా వీరికి కుమార్తె జన్మించి మూడు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరొక బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనుష్క శర్మ మరోసారి తల్లి కాబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎక్కడ ఈ విషయం గురించి ఈ జంట స్పందించిన దాఖలాలు లేవు. ఇక త్వరలోనే వీరిద్దరూ ఓ శుభవార్తను తెలియజేయబోతున్నారు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే విరాట్ కోహ్లీ పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 5వ తేదీ ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనీ సమాచారం. అయితే విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరూ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని శుభవార్తనే తెలియజేయబోతున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఐదవ తేదీ అనుష్క దంపతులు ఇదే విషయాన్ని వెల్లడిస్తారా లేక మరేదైనా గుడ్ న్యూస్ ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus