కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పిన అనుష్క!
January 28, 2018 / 09:55 AM IST
|Follow Us
స్వీటీ అనుష్క ప్రతి సినిమాని మొదటి సినిమాలాగా భావించి కష్టపడుతుంటుంది. తాను చేసే పాత్రకు న్యాయం చేసేవరకు నిద్రపోదు. ఆ డెడికేషన్ నచ్చే నిర్మాతలందరూ తమ సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేయాలనీ కోరుకుంటుంటారు. బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్కరి ఛాయిస్ అనుష్కే అయింది. అయితే అనుష్క మాత్రం ఏ ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. భాగమతి కూడా బాహుబలికి ముందు ఒప్పుకున్న చిత్రమే. దీంతో అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని వార్తలు షికారు చేసాయి. వీటన్నిటికీ నేడు అనుష్క ఫుల్ స్టాప్ పెట్టింది. భాగమతి నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మీడియా ముందుకు వచ్చిన అనుష్క అనేక విషయాలను పంచుకుంది.
“నేను ఇంకా బాహుబలి సినిమా విజయాన్నీ ఆస్వాదిస్తున్నాను. బాహుబలి సినిమాకోసం చాలా కష్టపడ్డాము. భాగమతి సినిమా కోసం కూడా బాగా శ్రమించాము. ఈ షూటింగ్ లో కొన్ని గాయాలు అయ్యాయి. అవి పూర్తిగా తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటున్నాను. అంతేకాదు బరువు తగ్గాలని భావిస్తున్నా. అందుకే ఏ సినిమాని ఒప్పుకోవడం లేదు” అని అనుష్క స్పష్టం చేసింది. అయితే ఈ మధ్యలో తనని మెప్పించే కథ వస్తే వెంటనే ఒకే చెబుతానని కూడా వెల్లడించింది.