ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్న అనుష్క!

  • November 8, 2018 / 10:19 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్టీఆర్’. ఈ సినిమా రిలీజ్ కి ముందుగానే అందరిలో ఆసక్తిని రోజు రోజుకి పెంచేస్తుంది. స్వర్గీయ నందమూరి తారక రామ రావు గారి పాత్రలో బాలకృష్ణ గారు నటిస్తుండగా, హీరో దగ్గుపాటి రానా నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా కి సంబంధించి ఒక్కో క్యారెక్టర్ గురించి రివీల్ చేస్తూ అందరిలో మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. దీపావళి కానుకగా సావిత్రి గారి పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ కి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఇక కథ పరంగా సినీ నేపథ్యంలో తారాగణం ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతుంది. అయితే అప్పట్లో ఎన్టీయార్, సరోజ దేవి కాంబినేషన్ ఒక సంచలనం. వీరిద్దరూ కలసి నటించిన అన్ని సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దింతో బయోపిక్ లో కూడా వీరిద్దరూ ఉన్న సన్నివేశాలు ఉంటాయని సరోజాదేవి గారి పాత్రల్లో అనుష్క కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అనుష్క ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుందనేది అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus