అనుష్క సినిమా ఫస్ట్ లుక్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధమేంటి?

  • August 28, 2019 / 06:09 PM IST

అవును పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అనుష్క సర్ప్రైజ్ ఇవ్వబోతుందట. అదేంటి అసలు పవన్ కళ్యాణ్, అనుష్క కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అలాంటిది పవన్ పుట్టిన రోజున అనుష్క సర్ప్రైజ్ ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా? అదేమీ లేదండి. అనుష్క నటిస్తున్న తరువాతి చిత్రం ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారట. ఆ రోజు వినాయక చవితి కూడా కాబట్టి చాలా సినిమాలకు సంబంధించి అదే రోజున ఫస్ట్ లుక్కులు విడుదల చేయబోతున్నారు.

ఈ లిస్ట్ లో అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఉందన్న మాట. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు మాధవన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అంజలి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. తమిళ, హిందీ, భాషల్లో కూడా ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కాబోతుంది. ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమా పై ‘సైలెన్స్’ పై మంచి క్రేజ్ ఏర్పడింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus