నాగార్జున కోసం సన్యాసినిగా మారిన అనుష్క!

  • June 16, 2016 / 08:52 AM IST

నాగార్జున సినిమాలో అనుష్క కనిపించలేదంటే వింతకానీ, కనిపిస్తే ఎందుకవుతుంది. కానీ.. ఎప్పట్లా గ్లామరస్ గా కాకుండా తాజా చిత్రంలో డీ-గ్లామర్ గా దర్శనమివ్వనుందట బొద్దుగుమ్మ.

విషయం ఏంటంటే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ముఖ్యపాత్రలో తెరకెక్కనున్న “ఓం నమో వెంకటేశాయ” చిత్రంలో ఇప్పటికే విమలారామన్ ఒక కథానాయికగా ఎంపికవ్వగా.. మరో ముఖ్యమైన “సన్యాసిని” పాత్ర కోసం అనుష్కను ఎన్నుకొన్నారట.

మరి ఇప్పటివరకూ అనుష్కను అందాలరాసిగా చూసిన ప్రేక్షకులు సన్యాసినిగా చూడగలరో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus