అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ విషయంలో అనుమానాలు..!

  • January 11, 2020 / 02:50 PM IST

2018లో వచ్చిన ‘భాగమతి’ చిత్రం తర్వాత మహేష్ నుండీ మరో చిత్రం రాలేదు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించినప్పటికీ.. అది అతిధి పాత్రే..! అయితే అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ముందుగా ప్రకటించారు. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు మాధవన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ మరియు టీజర్ కు విశేష ఆదరణ లభించింది. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందా… అంటే అలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో.. ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఈ అనుమానాలు రావడం మొదలయ్యాయాయి. ఈ క్రమంలో నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ … ” ‘నిశ్శబ్దం’ కు సంబంధించిన అప్డేట్స్ ను క్రమంగా ఇవ్వడానికి మేము ఓ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాము. సంక్రాంతి పండుగ నుండీ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు” అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus