పాపం సైజ్ జీరో సినిమా కోసం పెరిగిన బరువు తగ్గకపోవడంతో కథానాయికగా తక్కువ సినిమాలు చేస్తోంది కానీ.. ఆ సినిమాకి ముందు ఉన్నట్లుగా నాజూకుగా ఉన్నట్లయితే.. తమిళంలో నయనతార లాగా తెలుగులో అనుష్క టాప్ ప్లేస్ లో ఉండేది. తక్కువ సినిమాలు చేస్తేనేం.. మిగతా హీరోయిన్లు మూడు నాలుగు సినిమాలు చేస్తే సంపాదించే మొత్తాన్ని అనుష్క ఒకే ఒక్క సినిమాతో సంపాదిస్తోంది. “భాగమతి” అనంతరం గ్యాప్ తీసుకొని “నిశ్శబ్ధం” సినిమాలో మూగదానిగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అనుష్క దాదాపు మూడున్నర కోట్ల రూపాయాల్ని రెమ్యూనరేషన్ రూపంలో అందుకొంది.
ఇటీవల సైరా సినిమాలోనూ అతిధి పాత్రలో మెరిసిన అనుష్క.. త్వరలోనే మరో రెండు పెద్ద సినిమాలు సైన్ చేయనుందట. అలాగే.. మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి కూడా అనుష్క రంగం సిద్ధం చేసుకొంటోందని సమాచారం. అదే తరుణంలో తన మునుపటి శరీరాకృతిని సాధించుకొనేందుకు కూడా అనుష్క ఆహరహం శ్రమిస్తోంది.
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!