Pawan Kalyan: పవన్ సినిమాలపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్!
December 20, 2021 / 02:21 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజైన సమయంలో జగన్ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ నిర్ణయంతో ఏపీలో వకీల్ సాబ్ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు తగ్గాయి. అదే సమయంలో సెకండ్ వేవ్ వల్ల కరోనా కేసులు పెరగడంతో ఆ ప్రభావం వకీల్ సాబ్ సినిమాపై పడింది. ఇతర ఏరియాల్లో వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ అయినా ఏపీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం స్వల్పంగా నష్టపోయారు.
పవన్ నటించిన భీమ్లా నాయక్ మూవీ మరో 20 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. కొన్ని రోజుల క్రితం పవన్ మాట్లాడుతూ ఏపీలోని థియేటర్లలో తన సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తానని కామెంట్లు చేశారు. తన సినిమాలను ఆపేసి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు ఏపీ రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
అయితే తాజాగా మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ ఒక కామెడీ మూవీలాంటి వ్యక్తి అని విశాఖ ఉక్కుపై తాను ఈల వేస్తే మోదీ, అమిత్ షా పనులు చేస్తారని చెప్పే పవన్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని ఎందుకు చెప్పడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ ఏపీలో సినిమాలను ఫ్రీగా ప్రదర్శించడం కాదని బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా చేస్తే చాలని పేర్ని నాని అన్నారు.
పవన్ సినిమాలపై ఏపీ మంత్రి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విమర్శలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలో మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా ట్రైలర్ అతి త్వరలో రిలీజ్ కానుంది.