Brahmamudi: తండ్రి కష్టాన్ని చూసి చలించి పోయిన కావ్య?

  • July 18, 2023 / 05:58 PM IST

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి బ్రహ్మ ముడి సీరియల్ రోజు రోజుకు మంచి ఆదరణ సంపాదించుకుని ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే.. కృష్ణమూర్తి అంటు గట్టిగా అరుస్తూ సేటు తన అప్పు తీర్చకపోతే ఇల్లు తాకట్టు పెట్టుకుంటాను అని చెప్పిన మాటలను కావ్య వింటుంది.దీంతో తన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని బాధపడుతుంది.అప్పుడే స్వప్న వద్దకు వెళ్లి నీ లేని కడుపు కోసం చీరసార తేవడానికి అమ్మానాన్నలు ఇబ్బంది పడుతున్నారని స్వప్న మీద అరుస్తుంది.

వాళ్లు తెచ్చే చీప్ చీరలు నాకెందుకు అయినా వాళ్ళని ఇక్కడికి ఏమి తేవద్దని చెప్పు అని స్వప్న చాలా గర్వంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా నేను చెప్పిన అబద్ధాన్ని త్వరలోనే నిజం చేస్తాను నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ స్వప్న కావ్యం తిట్టడంతో కావ్య అక్కడి నుంచి అసహ్యించుకుని బయటకు వెళ్ళిపోతుంది. మరోవైపు అప్పు ఇంటికి కళ్యాణ్ సరుకులు కూరగాయలు తీసుకుని వెళ్తాడు అది చూసిన అప్పు తీవ్రస్థాయిలో కళ్యాణ్ పై కోప్పడుతుంది మేము తినడానికి కూడా గతి లేకుండా ఉన్నామని అనుకుంటున్నావా అందుకే ఇవన్నీ తీసుకొచ్చావా అంటూ అప్పు కళ్యాణ్ ను అవమానిస్తుంది.

తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా అప్పు మాట్లాడటంతో కళ్యాణ్ బాధతో అక్కడి నుంచి వెళ్తాడు. ఇక కళ్యాణ్ తిరిగి వెళుతుండగా అప్పు ఇవన్నీ తీసుకెళ్లి ఎక్కడైనా పేదవారికి ఇవ్వు అని మాట్లాడుతుంది.ఇక కావ్య ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పటికి కళ్యాణ్ అక్కడికి వచ్చి ఏమైంది వదిన అని అడుగుతాడు పెళ్లి తర్వాత తల్లిదండ్రుల బాధ్యత కొడుకు చేసుకోవచ్చు కానీ అమ్మాయి తీసుకోవడానికి వీలు లేదు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో కళ్యాణ్ వారి ఆర్థిక పరిస్థితి వదినకు కూడా తెలిసిపోయిందా అని అనుకుంటాడు.

మరోవైపు స్వప్న గుమ్మం వద్ద పార్సెల్ కోసం ఎదురుచూస్తుంది రాహుల్ వచ్చి ఏం చేస్తున్నావ్ అనగా డ్రెస్ ఆర్డర్ పెట్టానని చూపిస్తుంది ఈ డ్రెస్ చిన్నపిల్లకా అని అడగడంతో కాదు నాకే మోడలింగ్ కోసం అంటూ చెప్పడంతో రాహుల్ నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటానంటే నేనెందుకు కాదనుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు పనిమనిషి వచ్చి స్కూల్ ఫీజు కట్టడం కోసం రాజ్ ని అడగడంతో వెంటనే రాజ్ కావ్యకి చెప్పి డబ్బు ఇప్పిస్తాడు. ఇంట్లో ఉన్న పని వాళ్ళ పిల్లలందరికీ రాజ్ స్కూల్ ఫీజు కడుతున్నారని తెలిసి కావ్య ఆశ్చర్య పోతుంది.

అయినప్పటికీ తాను డబ్బు అడగడం మంచిది కాదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన తండ్రికి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉండగా కావ్య డిజైనర్ కి ఫోన్ చేస్తుంది.ఫోన్ లిఫ్ట్ చేసిన డిజైనర్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను ఇంతలో మీరే చేశారు మీరు వేసిన డిజైన్ చూసిన తర్వాత రాజ్ గారు నా డిజైన్స్ అసలు ఒప్పుకోవడం లేదనీ చెబుతుంది. తరువాత (Brahmamudi) ఎపిసోడ్లో అర్ధరాత్రి కావ్య డిజైన్స్ వేయడం చూసి రాజ్ ఆశ్చర్యపోతాడు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus