Ariyana: అలా చేయకపోతే చంపేస్తా.. అరియానా బోల్డ్ కామెంట్స్..?
May 27, 2021 / 08:02 PM IST
|Follow Us
ఆర్జీవీ ఇంటర్వ్యూల ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా అరియానా గ్లోరీ ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాను బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ రియల్ లైఫ్ లో నిజంగానే బోల్డ్ అనే సంగతి తెలిసిందే. అయితే అరియానాను అమితంగా అభిమానించే అభిమానులు మాత్రం ఆమె బోల్డ్ కాదని గోల్డ్ అని చెబుతుంటారు. బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో అవకాశాలను సంపాదించుకుంటున్నారు.
తాజాగా అరియానా ఫ్యాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించి అభిమానుల సందేహాలు తీర్చడంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. అరియానాకు తన ఫేవరెట్ పర్సన్ ఎవరనే ప్రశ్న ఎదురు కాగా తానే తన ఫేవరెట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చారు. నటన, యాంకరింగ్ లలో యాంకరింగ్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె వెల్లడించారు. వాట్సాప్ డీపీని అరియానా షేర్ చేయగా అరియానా అందులో ట్రెడిషినల్ గా కనిపించారు.
యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు స్పందిస్తూ ఎలాంటి వీడియోలు చేయాలో తనకు అర్థం కావడం లేదని అరియానా అన్నారు. ఒక నెటిజన్ వాట్సాప్ నంబర్ అడగగా నంబర్ ఇస్తే తనను ఇంట్లో చంపేస్తారని అందువల్ల ఇవ్వలేనని అరియానా తెలిపారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే మాత్రం అతనిని చంపేస్తానని అరియానా సరదాగా అన్నారు.