బిగ్ బాస్4: ఆడియన్స్ మనసు దోచిన అరియానా – హారిక..!
October 23, 2020 / 12:10 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో బండితోయరా బాబూ అనే టాస్క్ లో అవినాష్ హౌస్ మేట్స్ ని కన్విన్స్ చేసుకుని మరీ కెప్టెన్ అయ్యాడు. అభిజిత్, లాస్య, అఖిల్, సోహైల్, అమ్మరాజశేఖర్ ఇంకా మోనాల్ ఈ ఆరుగురు అవినాష్ కి సపోర్ట్ చేస్తే.., దివి – హారిక – మోహబూబ్ – నోయల్ అరియానాకి సపోర్ట్ చేశారు. ఇక్కడ అవినాష్ కెప్టెన్ గా గెలిస్తే.., గేమ్ లో ప్లేయర్ గా గేమ్ బాగా ఆడి అరియనా అందరి మనసులు గెలుచుకుంది.
అవినాష్ ఏదంటే అది ప్రామిస్ లు ఇచ్చేసి కెప్టెన్ అయ్యాడు కానీ, అరియానా హౌస్ లో పని చేయను అంటే కుదరదు అని అలాంటి వాళ్లు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అని గట్టిగా నిలబడింది.
అంతేకాదు, మోనాల్ తో తీసుకున్న క్లారిటీ ఎపిసోడ్ లోనే హైలెట్. మోనాల్ ఇచ్చిన రీజన్ వాలిడ్ గా ఉన్నా కూడా ఫస్ట్ నాకు ఎందుకు సపోర్ట్ చేశావ్ అని అరియానా క్లియర్ గా మోనాల్ ని నిలదీసింది. ఇది నీ గేమ్ ప్లానా అంటూ అడిగింది. ఇక్కడే అవినాష్ డిస్టర్బ్ చేస్తున్నా కూడా నాకు కెప్టెన్సీ కాదు క్లారిటీ కావాలి అంటూ మాట్లాడింది.
ఆడియన్స్ మనుసులు గెలుచుకుంది. అంతేకాదు, అరియానాకి సపోర్ట్ చేసిన హారిక కూడా లాస్య తర్వాత ఇంట్లో లేడీ కెప్టెన్ లేదు అని అందుకే నేను గట్టిగా అరియనానాకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది. దీంతో నోయల్ కి కూడా ఈరీజన్ నచ్చి అరియానావైపు వచ్చాడు.
దివి – హారిక తాము తీసుకున్న డెసీషన్ పై స్టిక్ అయ్యారు. ఇక్కడ అమ్మరాజశేఖర్ రెండుసార్లు ఫ్లిప్ అయ్యాడు. అంతేకాదు, అరియనా కెప్టెన్సీ అంటే టార్చర్ అని, అదే అవినాష్ కెప్టెన్సీ అయితే జాలీగా ఉంటుందని స్టేట్మంట్ కూడా ఇచ్చాడు.
మరి ఈ కెప్టెన్సీ టాస్క్ పైన, కొంటెరాక్షసుల టాస్క్ పైన నాగార్జున శనివారం ఎలా స్పందిస్తారో చూడాలి.