అనేకసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ‘అర్జున్ సురవరం’ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 29న విడుదలయ్యింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఠాగూర్’ మధు సమర్పకుడు. రిలీజ్ లేటవుతూ రావడంతో ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తగ్గిపోయిందని చెప్పాలి. మొదటి షో నుండీ పాజిటివ్ టాక్ వస్తేనే కానీ ఈవెనింగ్ షోలు ఫుల్ అవ్వని పరిస్థితి ఏర్పడింది. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ టాక్ రావడంతో మొదటి వీకెండ్ బాగానే క్యాష్ చేసుకుందని చెప్పాలి.
నైజాం
1.02 cr
సీడెడ్
0.50 cr
ఉత్తరాంధ్ర
0.60 cr
ఈస్ట్
0.38 cr
వెస్ట్
0.31 cr
కృష్ణా
0.41 cr
గుంటూరు
0.55 cr
నెల్లూరు
0.26 cr
ఏపీ + తెలంగాణ
4.03 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.24 cr
ఓవర్సీస్
0.51 cr
టోటల్ వరల్డ్ వైడ్
4.78 cr (share)
ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. మిగిలిన ప్లేసుల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారట నిర్మాతలు. సో ఈ చిత్రం 5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే. పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం ఉన్న సినిమాలు కూడా ఏమీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ‘అర్జున్ సురవరం’ కి కలిసొచ్చిందనే చెప్పాలి. మొదటి సోమవారం కూడా ఈ చిత్రం 0.59 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం నాలుగురోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 4.78 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో 0.25 కోట్ల షేర్ వరకూ రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే. వీక్ డేస్ లో కూడా ఇదే డీసెంట్ రన్ కొనసాగిస్తే నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు అనడంలో సందేహం లేదు.