‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని దాదాపు అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో విడుదలైనప్పటికీ .. మంచి టైంలోనే విడుదలయ్యిందని చెప్పాలి. చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడం.. డీసెంట్ టాక్ రావడం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రం బయ్యర్స్ కు అలాగే నిర్మాతలకి లాభాల్ని అందించింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించగా… ‘ఠాగూర్’ మధు సమర్పకుడిగా వ్యవహరించాడు. ‘పేక్ సర్టిఫికేట్ ల వల్ల.. ఎంతో ట్యాలెంట్ ఉన్న కొందరి యువత భవిష్యత్తు నాశనమైతోందని.. ఆ ‘ఫేక్ సర్టిఫికేట్ మాఫియాని అంతం చేయడానికి ఓ జర్నలిస్ట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు’ అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో ఈ చిత్రం రూపొందింది.
ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 3.69 cr |
సీడెడ్ | 0.94 cr |
ఉత్తరాంధ్ర | 1.03 cr |
ఈస్ట్ | 0.63 cr |
వెస్ట్ | 0.50 cr |
కృష్ణా | 0.67 cr |
గుంటూరు | 0.81 cr |
నెల్లూరు | 0.40 cr |
ఏపీ + తెలంగాణ | 8.67 cr(share) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.60 cr (corrected) |
ఓవర్సీస్ | 0.61 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 9.88 cr (share) |
‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే కొన్ని ఏరియాల్లో.. నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 9.88 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం నిర్మాతలు, బయ్యర్స్ .. అందరికీ లాభాలు దక్కాయి. మొత్తానికి ఈ చిత్రం నిఖిల్ కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి.