Asvins Review in Telugu: అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 23, 2023 / 10:45 AM IST

Cast & Crew

  • వసంత్ రవి, (Hero)
  • విమలా రామన్ (Heroine)
  • మురళీధరన్, సరస్ మీనన్, ఉదయ దీప్, సిమ్రాన్ ప్రతీక్ తదితరులు.. (Cast)
  • తరుణ్ తేజ (Director)
  • బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ (Producer)
  • విజయ్ సిద్ధార్థ్ (Music)
  • ఏ.ఎం.అడ్విన్ సకాయ్ (Cinematography)

డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ “తారామణి, రాకీ” చిత్రాలతో తమిళనాట మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు వసంత్ రవి. ఈసారి హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సమాయత్తమయ్యాడు. తరుణ్ తేజ దర్శకత్వంలో రూపొందిన “అశ్విన్స్” టీజర్ & ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏస్థాయిలో అలరించిందో చూద్దాం..!!

కథ: 1500 ఏళ్ల క్రితం నిర్మింపబడి.. 15కి పైగా హత్యలు జరిగిన ఓ బంగ్లాలో వ్లోగ్ తీయడానికి అర్జున్ (వసంత్ రవి) & ఫ్రెండ్స్ వెళతారు. బంగ్లాలోకి ఎంటర్ అయినప్పట్నుంచి కొన్ని విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ బంగ్లాలో చనిపోయిన 15 మంది ఎవరు? ఆ బంగ్లాలో ఆత్మలా తిరుగుతున్న మహిళ ఎవరు? అర్జున్ & ఫ్రెండ్స్ బంగ్లా నుండి ప్రాణాలతో బయటపడగలిగారా? వంటి ప్రశ్నలకు సమాధానమే “అశ్విన్స్” చిత్రం.

నటీనటుల పనితీరు: దాదాపుగా సినిమాలో నటించినవాళ్ళందరూ మన తెలుగు ఆడియన్స్ కు కొత్తే. అలాగే.. వసంత్ రవి మినహా ఎవరూ సినిమాలో పెద్దగా రిజిస్టర్ అవ్వడానికి అవకాశం లేకుండాపోయింది. విమలా రామన్ మాత్రం ప్రత్యేక పాత్ర అయినప్పటికీ.. తన హావభావాలతో అలరించించి.

సాంకేతికవర్గం పనితీరు: సినిమా చూస్తున్న ప్రేక్షకులు భయానికి లోనవ్వడమే కాదు.. సినిమాలో లీనమయ్యారంటే మాత్రం ఏకైక కారణం సంగీత దర్శకుడు విజయ్ సిద్ధార్ధ్. ఇప్పటివరకూ మనం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసిన సౌండ్ డిజైనింగ్ ను ఇండియన్ ఆడియన్స్ కు ఒక సౌత్ సినిమాతో పరిచయం చేశాడు విజయ్ సిద్ధార్ధ్. అలాగే నేపధ్య సంగీతం కూడా ఒళ్ళు గగుర్పాటు కలిగించేలా ఉంది.

సినిమాటోగ్రాఫర్ అడ్విన్ సకాయ్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు. హారర్ సినిమాల్లో సాధారణంగా కనిపించే జంప్ స్కేర్ షాట్స్ తో కాకుండా.. కెమెరా యాంగిల్స్ తో యాంటిసిపేషన్ క్రియేట్ చేసి.. ఆ యాంటిసిపేషన్ నుంచి భయం క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైన్ వర్క్ కూడా ప్రశంసనీయం.

దర్శకుడు తరుణ్ తేజ.. హారర్ సినిమాని మైథాలజీ రూట్ లో నడిపించి.. లాజికల్ గా ఎండ్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా.. సినిమాకి తగ్గ లొకేషన్స్ ను ఫైనలైజ్ చేయడంలోనే సగం విజయం సాధించాడు దర్శకుడు. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్ లో వచ్చే బంగ్లా ఎంట్రెన్స్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం టెర్రీఫిక్ గా ఉంది. అయితే.. ఫస్టాఫ్ ను ఎంతో పకద్భంధీగా రాసుకున్న దర్శకుడు తరుణ్.. సెకండాఫ్ లో “అశ్వినీ పుత్రులు” కాన్సెప్ట్ కు జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం చూపించిన రెండు ప్రపంచాలు, రెండు మెదళ్లు కాన్సెప్ట్ లాజికల్ గా ఓ మోస్తరుగా ఉన్నా..

సినిమాటిక్ గా మాత్రం సింక్ అవ్వలేదు. అందువల్ల.. ఫస్టాఫ్ లో సినిమాకి విశేషంగా కనెక్ట్ అయిన ఆడియన్స్ అందరూ సెకండాఫ్ కి వచ్చేసరికి డిస్కనెక్ట్ అయిపోతారు. వైట్ లైట్ & గ్రీన్ లైట్ కాన్సెప్ట్ తో ఏది ఊహ, ఏది నిజం ఆనేది వివరించడానికి బాగానే ప్రయత్నించాడు కానీ.. ఎందుకో సరిగా ఎలివేట్ అవ్వలేదు. ఓవరాల్ గా కథకుడిగా కంటే టెక్నీషియన్ గా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు దర్శకుడు తరుణ్ తేజ.

విశ్లేషణ: ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం (Asvins) “అశ్విన్స్” సినిమాను చక్కని డాల్బీ అట్మోస్ థియేటర్లో ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే.. సెకండాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే.. హారర్ జోనర్ లో టాప్ 20 సినిమాల్లో ఒకటిగా నిలిచేది. అయినప్పటికీ.. సౌండ్ డిజైనింగ్ పరంగా ఈ చిత్రం భవిష్యత్ ఫిలిమ్ మేకర్స్ కు ఒక మాస్టర్ క్లాస్ గా నిలుస్తుంది.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus