‘అతిథి’ లో హీరోయిన్ చెల్లిగా చేసిన ఈ పాప ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..!

  • April 16, 2023 / 06:05 PM IST

‘పోకిరి’ తర్వాత మహేష్ బాబుని మూడు ప్లాపులు పలకరించాయి. అందులో ‘అతిథి’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యూటీవీ మోషన్ పిక్చర్స్’ ‘కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ల పై మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.  2007 అక్టోబర్ 18న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. సురేందర్ రెడ్డి సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ కు పెద్ద పీట వేస్తుంటాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.

ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ కానివ్వడు. కానీ ‘అతిథి’ సినిమా చాలా సీరియస్ గా సాగుతూ ఉంటుంది. ఇంత సీరియస్ సినిమాని.. మహేష్ అభిమానులు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. అయితే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా రిచ్ గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఓ హాలీవుడ్ సినిమాని చూస్తున్నామన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘అతిథి’ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృత రావు నటించింది.

ఇక ఆమె చెల్లెలిగా ఓ పాప కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఈ పాప చనిపోవడం అనేది ప్రేక్షకులకు నచ్చలేదు. చాలా క్యూట్ గా ఉండే ఈ పాపను హీరో కాపాడలేకపోవడం ఓ మాస్ సినిమాకి ఉండాల్సిన లక్షణం కాదు అని చాలా మంది పెదవి విరిచారు. అయితే ఈ పాప చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈమె పేరు కర్మన్ సంధు. ఇప్పుడు ఈ పాప హీరోయిన్ మాదిరి అయిపోయింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus