Athidhi Review in Telugu: అతిథి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • September 20, 2023 / 07:04 AM IST

Cast & Crew

  • వేణు తొట్టెంపూడి (Hero)
  • అవంతిక మిశ్రా (Heroine)
  • వెంకటేష్ కాకుమాను, అదితి గౌతమ్, రవివర్మ, భద్రం తదితరులు (Cast)
  • భరత్ వైజి (Director)
  • ప్రవీణ్ సత్తారు (Producer)
  • కపిల్ కుమార్ (Music)
  • మనోజ్ కటసాని (Cinematography)

ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి అందరికీ గుర్తుండే ఉంటాడు. గతేడాది ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. గత వారం పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కాలేదు. ఓటీటీలోకి కూడా ఇంప్రెస్ చేసే కంటెంట్ అయితే రాలేదు. చాలా మందికి సెప్టెంబర్ 19న కూడా వినాయక చవితి హాలిడే ఉంది. దీంతో ‘అతిథి’ పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : రవి (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) ఇద్దరూ భార్యాభర్తలు. ఓ పెద్ద బంగ్లాలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. రవి భార్య సంధ్య పక్షవాతం వల్ల మంచానికే పరిమితమవుతుంది. ఆమెకు సేవలు చేస్తూ మరోపక్క కథలు రాస్తూ జీవితాన్ని గడుపుతాడు రవి. అయితే అతను ఓ రోజు రాసిన కథలోలానే ఓ వర్షం కురిసిన రాత్రి అతని ఇంటికి మాయ (అవంతిక) ఆమె అమ్మాయి వస్తుంది. మరోపక్క యూట్యూబర్ సవేరి (వెంకటేష్ కాకుమాను) కూడా దెయ్యాలు లేవు అనే కాన్సెప్ట్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా…

మధ్యలో అతన్ని ఏదో దెయ్యం వెంబడిస్తుంది అని భయపడి.. రవి ఇంటికి వస్తాడు. అటు తర్వాత ప్రకాష్ (రవి వర్మ) కూడా రవి ఇంటికి వస్తాడు. అయితే వాళ్ళు ఎంట్రీ ఇచ్చాక.. అక్కడ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాని వెనుక ఉన్నది ఎవరు? మాయ దెయ్యమా? లేక అక్కడ మరో దెయ్యం ఉందా? అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు : వేణు తొట్టెంపూడి కామెడీ పండించడంలో సిద్ధహస్తుడు. కానీ రీ ఎంట్రీలో అతను సీరియస్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బహుశా కామెడీకి కాలం చెల్లిపోయింది అనుకుంటున్నాడో ఏమో..! ‘అతిథి’ లో వేణు చాలా సెటిల్డ్ గా నటించాడు. కామెడీ చేసే వాళ్ళు ఎలాంటి పాత్రలైనా చేసేయొచ్చు. కాబట్టి ఈ పాత్ర అతనికి ఛాలెంజింగ్ రోల్ అని చెప్పలేం. అలా అని అతను ఎక్కడా డిజప్పాయింట్ చేసింది కూడా లేదు. పాత్రకి తగినట్టు నటించాడు. సంధ్య గా అధితి గౌతమ్ పర్వాలేదు అనిపిస్తుంది.

ఆమె పెద్దగా కష్టపడింది అంటూ ఏమీ లేదు కానీ కీలక పాత్ర కాబట్టి.. ఈమెను స్పెషల్ గా చెప్పుకోవాలి. ఇక మాయ పాత్రలో అవంతిక అందంతో పాటు నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. రవి వర్మకు పాత్ర రొటీన్ గానే ఉంది. అయితే తన వరకు బాగానే చేశాడు. వెంకటేష్ కాకుమానుకు భయపడుతూనే నవ్వించే ప్రయత్నం చేశాడు. అతని పాత్రకి కూడా మంచి మార్కులే పడ్డాయి. భద్రమ్ పాత్ర జస్ట్ ఓకే.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు భరత్ వైజి.. ‘అతిథి’ ని చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశాడు. 6 ఎపిసోడ్లు కలిగిన ఈ సిరీస్ ను మొదటి 3 ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపాడు అని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత గ్రిప్పింగ్ గా అనిపించదు. థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఏదో వెలితి. దెయ్యానికి లాజిక్కులు ఉండవు అన్నట్టు ఓ డైలాగ్ తో చాలా ప్రశ్నలను అతను ఆపేసినట్టు అయ్యింది. హారర్ సినిమాలు చాలా వరకు ఒకే టెంప్లెట్ లో ఉంటాయి.

ఆ దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం, ఆమె చంపాలనుకున్న వాళ్ళను చంపేసి మంచిగా జనాలను డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోవడం ఒకటి అయితే .. ఇంకోటి చెడ్డ దెయ్యాల సినిమాలు. ‘అతిథి’ వెబ్ సిరీస్ ఈ రెండిటికి మధ్యలో ఉంది. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ బాగుంది. హర్రర్ సినిమాలకి తగ్గట్టుగా ఉంటుంది. ప్రవీణ్ సత్తారు నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ.. మరీ సూపర్ అని అయితే చెప్పలేము.

విశ్లేషణ : ‘అతిథి’ (Athidhi) మొదటి మూడు ఎపిసోడ్స్ బాగున్నాయి. క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. కానీ తర్వాత రెగ్యులర్ ఫార్మేట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ సిరీసే కాబట్టి హర్రర్ సినిమాలు, సిరీస్ లు ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus