నిర్మాత అచ్చిబాబు పై జూనియర్ ఆర్టిస్టుల దాడి..!!

  • August 3, 2016 / 06:02 AM IST

మంచు మనోజ్ కొత్త చిత్రం “ఒక్కడు మిగిలాడు” షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. ఆ చిత్ర నిర్మాత అచ్చిబాబు పై జూనియర్ ఆర్టిస్టులు దాడికి దిగడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఇరువర్గ్లాల వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మనోజ్ సినిమా కోసం వైజాక్ లోని పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో పెద్ద సెట్ వేశారు. అక్కడ గతనెల 15 న షూటింగ్ మొదలైంది.

మొదట నాలుగు రోజుల పాటు అనుకున్న షూటింగ్ మరో పది రోజులకు పొడిగించారు. ఈ షూటింగ్ మొత్తానికి 9 లక్షలు తీసుకునేలా జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్ అంగీకరించారు. వారికి నిర్మాత అచ్చిబాబు 5 లక్షలు చెల్లించారు. ఇంకా నాలుగు లక్షలు పెండింగ్లో ఉంది. ఆ మొత్తం ఇవ్వాలని నిర్మాతను ఒత్తిడి చేశారు. ఆలస్యం కావడంతో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు తనపై దాడి చేశారని నిర్మాత అచ్చిబాబు కేసు పెట్టారు. ఈ దాడిని హీరో మనోజ్ ఖండించారు. సమస్యను పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ దాడికి దిగకూడదని చెప్పారు. ఈ విషయంపై విచారణ చేపట్టి న్యాయం జరిగే వరకు షూటింగ్ ఆపు చేస్తున్నట్లు ప్రకటించారు.  హైదరాబాద్ లోని నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ఈ దాడిపై పూర్తి విచారణ చేపట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus