సినిమా వచ్చిన ఇన్నాళ్లయినా జోరు మామూలుగా లేదు

  • March 15, 2021 / 03:32 PM IST

జేమ్స్‌ కెమెరూన్‌ సినిమా పరిశ్రమకు ఇచ్చిన అద్భుతం ‘అవతార్‌’. సినిమా విడుదలైన రోజు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన ఎంతో…. ఇప్పటికీ అదే రేంజిలో ప్రేక్షకులు ఆ సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా సినిమా రీ రిలీజ్‌లోనూ రికార్డులు కొడుతుండటమే దీనికి ఉదాహరణ. అవును ‘అవతార్‌’ను ఇటీవల చైనాలో రీ రిలీజ్‌ చేశారు. రావడం, రావడమే సినిమా రికార్డులు కొడుతోంది. ఈ క్రమంలో ‘అవెంజన్స్‌’ను దాటేసింది. చైనాలో రీ-రిలీజ్​ అయిన ‘అవతార్‌’కు శుక్రవారం ఒక్కరోజే రూ.25.44 కోట్ల కలెక్షన్లు వచ్చాయట.

దీంతో ‘అవెంజర్స్​: ఎండ్​గేమ్​’ దాటుకొని మరోసారి ఆ జాబితాలో అగ్రస్థానానికి ‘అవతార్​’ చేరుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘అవతార్’ మరోసారి నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.20.33 వేల కోట్లు వసూలు చేసింది. ఇంకా వసూళ్లు కొనసాగుతున్నాయి. ‘అవెంజర్స్​: ఎండ్​గేమ్’​ విడుదలకు ముందు ఈ రికార్డు ‘అవతార్’ పేరిటే ఉండేది. ఆ చిత్రాన్ని రెండుసార్లు విడుదల చేయడంతో ‘అవతార్​’ను అధిగమించింది. తాజాగా చైనాలో శుక్రవారం వచ్చిన కలెక్షన్లతో ‘అవతార్​ ’మళ్లీ అగ్రస్థానానికి వచ్చేసింది.

‘అవతార్’​ 2009లో రాగా, అవెంజర్స్​: ఎండ్​గేమ్​’ 2019లో వచ్చింది. తొలి ‘అవతార్‌’ రికార్డులు కొడుతున్న ఈ సమయంలో దర్శకుడు జేమ్స్​ కెమెరూన్​.. ‘అవతార్​’కు సీక్వెల్​ రూపొందించే పనిలో ఉన్నారు. 2022 డిసెంబరులో రెండో ‘అవతార్‌’ వస్తుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus