బాహుబలి దెబ్బకి కనుమరుగు అయిన చిరు రికార్డు !

  • May 6, 2017 / 10:58 AM IST

మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 10ఏళ్ల ముందు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజాకీయాల్లో కింగ్ మేకర్ అయిపోదాం అనుకుని పార్టీ పెట్టి మరీ ప్రజల్లోకి వెళ్ళిన చిరుకి పాపం తన పొలిటికల్ స్టామినా ఏంటో అర్ధం అయ్యి, తన సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చివరకు కేంద్రమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అదే క్రమంలో చిరు పొలిటికల్ గా మనకు ఎలాగో వర్కౌట్ అవదు అని భావించాడో ఏమో తెలీదు కానీ, మొత్తంగా మళ్లీ సినిమాల వైపు అడుగులు వేశాడు. 10ఏళ్ల సుధీర్గ విరామం తరువాత మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చిరు చివరకూ తన 150వ సినిమా అంటూ ఫక్తు తమిళ కధను అరువు తెచ్చుకుని మరీ సేఫ్ సైడ్ గా కమర్షియల్ సినిమానే చేశాడు. 10ఏళ్ల గ్యాప్ రావడంతో చిరు సినిమాకి తొలి రోజు నుంచే అభిమానులు బ్రహ్మరధం పట్టారు. అంతేకాకుండా భారీ హిట్ చేసి మంచి రిసల్ట్ అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో చిరు మంచి రికార్డు నెలకొల్పడాని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇంతకీ ఏంటి ఆ రికార్డ్ ఏమా కధ అంటే, ఖైదీ నెంబర్ 150 సినిమా ఒక్క ఉత్త‌రాంధ్ర ప్రాంతం లోనే దాదాపు ప‌ది కోట్ల రూపాయ‌ల షేర్ సాధించి సినీ పండితుల లెక్కల ప్రకారం తెలుస్తున్న విషయం. అంతేకాదు ఆ సునామీకి అంత‌కు ముందు బాహుబ‌లి-1 పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టింది అని కూడా తెలుస్తుంది. అయితే ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఉత్త‌రాంధ్ర రీజియ‌న్‌లో ఫుల్ ర‌న్‌లో 10 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు  ఆ ఫుల్ ర‌న్‌ రికార్డును బాహుబ‌లి 2, ది కంక్లూజ‌న్ సినిమా సరిగ్గా ఆరంటే ఆరు రోజు ల్లోనే బ్రేక్ చేసింది. ఆరు రోజు ల్లోనే 14 కోట్ల రూపాయ‌ల షేర్ సాధించి బాహుబ‌లి 2, ది కంక్లూజ‌న్  డిస్ట్రిబ్యూట‌ర్‌ను లాభాల బాట ప‌ట్టించింది. ఇదిలా ఉంటే  ఫుల్‌ర‌న్‌ లో బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం లోనే పాతిక కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు సాధించే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా బాహుబలి నార్త్ లో ఖాన్స్ కే చెక్కు పెట్టింది అనుకున్నాం, పాపం ఇక్కడ మెగాస్టార్ పరిస్థితి కూడా అదే అని ఈ లెక్కలు చెబుతున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus