బాహుబలి దాదాపుగా నాలు బాషల్లో విడుదలయ్యి సంచలనంగా మారడంతో ఈ సినిమాను ఎలా అయినా చైనా..మరియు యురోపియన్ దేశాల్లో కూడా విడుదల చెయ్యాలి అని ప్లాన్ లో ఉన్నాడు మన జక్కన్న. ఇప్పటికే దాదాపుగా ఓవరాల్ గా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి2 సినిమాని చైనాలో విడుదల చెయ్యాలి అనుకోవడం నిజంగా సాహసం అనే చెప్పాలి, దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమా మొదటి పార్ట్ అదే…బాహుబలి1 చైనాలో ఆల్రెడీ విడుదలయ్యి ఫ్లాప్ కావడమే. అయితే మొదటి పార్ట్ ఫ్లాప్ అయినా రెండో పార్ట్ ఎందుకు అక్కడ విడుదల చెయ్యాలి అని బాహుబలి అండ్ టీమ్ ఆలోచిస్తుంది అంటే దానికి కారణం దంగల్ చైనాలో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తూ ఉండడంతో, ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాలనే ఉద్దేశ్యంతో బాహుబలి 2 ని చెక్కుతున్నారట.
అయితే సినిమాని కాస్త ట్రిమ్ చేసి వదలాలి అన్న ఆలోచనతో కొన్ని సీన్స్ ను తీసేయ్యాలి అని బాహుబలి అండ్ టీమ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ తతంగం అంతా అయ్యేసరికి రెండు మూడు నెలలు పడుతుంది. అదే క్రమంలో ఈలోపు దంగల్ అక్కడ తగ్గుతుంది. ఇక అదే ఊపులో మన బాహుబలిని వదిలితే విజయం తప్పక వరిస్తుంది అని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏదైతేనేం, బాహుబలి చివరకు చైనాలో కూడా తన సత్తా చాటనుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.