విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.
వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఓ రేంజ్లో వర్షాలు కురుస్తున్నా..కలెక్షన్స్ ఆగడం లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 8.42 cr |
సీడెడ్ | 2.9 cr |
ఉత్తరాంధ్ర | 3.39 cr |
ఈస్ట్ | 1.60 cr |
వెస్ట్ | 0.86 cr |
గుంటూరు | 1.04 cr |
కృష్ణా | 1.19 cr |
నెల్లూరు | 0.66 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 20.06 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.86 cr |
ఓవర్సీస్ | 2.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 23.07 cr (షేర్) |
బేబీ (Baby) మూవీకి రూ. 5.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.23.07 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.16.87 కోట్ల లాభాలను అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్ద సినిమాలకి కూడా సాధ్యం కాని కలెక్షన్స్ ను ఈ చిత్రం రాబడుతుంది అని చెప్పాలి.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు