Bro Movie: ‘బ్రో’ కలెక్షన్స్ పై వాటి ప్రభావం ఉంటుందా..బుకింగ్స్ అందుకే ఓపెన్ కాలేదా?

  • July 26, 2023 / 01:45 PM IST

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి ఇది రీమేక్. జూలై 28 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా పై ఎందుకో పెద్దగా బజ్ లేదు.

వాస్తవానికి ఈ సినిమాలో (Bro Movie) పవన్ కళ్యాణ్ చేస్తుంది హీరో పాత్ర కాదు. కానీ అతని వల్లే ఈ సినిమా స్పాన్ పెరిగింది. బిజినెస్ కూడా పవన్ కళ్యాణ్ వల్లే ఎక్కువ జరిగింది. సాయి ధరమ్ తేజ్ – సముద్రఖని కాంబో మూవీకి ఈ రేంజ్ బిజినెస్ అయితే జరగదు. అయితే మరోపక్క ‘బేబీ’ సినిమా ఇప్పటికీ సూపర్ కలెక్షన్స్ సాధిస్తుంది. వీక్ డేస్ లో స్టార్ హీరోల సినిమాలకు అసాధ్యమైన కలెక్షన్స్ ను ఈ సినిమా రాబడుతుంది.

మరోపక్క వర్షాలు నాన్ స్టాప్ గా కురుస్తున్నాయి. ఆంధ్రాలో ఎలాగూ మార్నింగ్ షోలు పడవు. టికెట్ హైక్స్ కూడా ఉండవు. అయితే ఇప్పుడు గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణాలో కూడా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. పవన్ స్థాయికి తగ్గ ఓపెనింగ్స్ వస్తాయేమో కానీ భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో వర్షాలు తగ్గిపోతే గొడవే ఉండదు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus