టాలీవుడ్ చరిత్రని ప్రపంచ వ్యాప్తం చేసిన సినిమా బాహుబలి…టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈసీనిమా టాలీవుడ్ ని ఒక రేంజ్ కి తీసుకు వెళ్ళింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరక్కిస్తున్నాడు జక్కన్న…మొదటి పార్ట్ సూపర్ హిట్ అయిన సంధర్భంలో రెండి భాగంపై పూర్తి దృష్టి పెట్టాడు రాజమౌళి. ఇదిలా ఉంటే తొలి భాగం చివర్లో ‘కట్టప్ప భాహుబలిని’ ఎందుకు ఛంపాడో అన్న సస్పెన్స్ తో ఎండ్ చేసిన రాజమౌళి, ఆ సీన్ టి రెండో పార్ట్ పై సర్వత్రా చర్చించుకునేలా చేశాడు. అయితే అదంతా పబ్లిసిటీ స్టంట్ లో ఒక భాగం అని తరువాత కొన్నాళ్ళకి సరిపెట్టుకున్నాడు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ ఈ సినిమాపై కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న చర్చకు తెరలేసింది. అదే క్రమంలో అసలు ఈ సస్పెన్స్ కి ఎవరెవరికి తెలుసో అన్న కోణంలో ఆలోచిస్తే….కేవలం ముగ్గురికే ఈ సస్పెన్స్ తెలుసు అని తప్పితే మరెవ్వరికీ తెలీదు అని చెబుతున్నాడు జక్కన్న…ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకరు రాజమౌళి, రెండు కధా రచయిత విజయేంద్ర ప్రసాద్, మూడు హీరో ప్రభాస్. అదే క్రమంలో మరికొందరికి తెలిసినా…వారిని డైవర్ట్ చెయ్యడానికి, ఈ సస్పెన్స్ బయటకు రాకుండా చూడటానికి చాలా తెలివిగా నాలుగు క్లైమాక్స్ లను షూట్ చేసి అందులో బెస్ట్ క్లైమాక్స్ ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు మన జక్కన్న…..ఏది ఏమైనా…ఈ సీక్రెట్ బయటకు తెలియకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు రాజమౌళి.