బాహుబలి బిగినింగ్ కంటే ముందు కథ తెలుసుకోవాలని ఉందా?

  • January 17, 2017 / 11:28 AM IST

పుస్తకం రూపంలో ఉన్న కథను సినిమాగా తీయడం, సినిమాను పుస్తకం గా రాయడం ఇప్పటి వరకు విని ఉన్నాం. చూసి ఉన్నాం. బాహుబలి చిత్రం మాత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీకి  బాహుబలి కంక్లూజన్ పేరిట కొనసాగింపు చిత్రం సిద్ధమవుతోంది. అంతేకాకుండా యానిమేషన్ సిరీస్ రెడీ అవుతోంది. ఈ ఫిల్మ్ లోని ప్రధాన పాత్రల బొమ్మలు, గేమ్స్ కూడా అందు బాటులోకి వచ్చాయి. తాజాగా బాహుబలి బిగినింగ్ కంటే ముందు ఏమి జరిగింది? అనే విషయంపై ఓ రచయిత పుస్తకం రాస్తున్నారు. కొచ్చికి చెందిన రచయిత ఆనంద్ నీలకంఠన్ బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్ పేరుతో పుస్తకాల సిరీస్ ను తీసుకొస్తున్నారు.

సిరీస్ లో భాగంగా మొదటి పుస్తకం ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ని సిద్ధం చేసి కవర్ ను ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు. మిగిలిన రెండు పుస్తకాలు కీలక పాత్రధారి కట్టప్ప కి  సంబంధించినవని చెబుతున్నారు. ముందుగా ఇంగ్లీషులో ఈ పుస్తకాల్ని రిలీజ్ చేసి తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి – ది కన్ క్లూజన్  విడుదల అనంతరం ఈ పుస్తకాలను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పుస్తకాలు ఎన్ని రికార్డులు సృష్టించనుందో తెలియాలంటే మూడు నెలలు ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus