దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్న వేణు.!

  • March 4, 2023 / 07:36 PM IST

‘రణం’ ‘కంత్రి’ ‘మున్నా’ ‘అతిథి’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘మహానుభావుడు’ వంటి సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించిన వేణు … ఎక్కువగా ‘జబర్దస్త్’ కామెడీ షోతోనే బాగా ఫేమస్ అయ్యాడు. ఈ కామెడీ షోలో టీం లీడర్ గా చేసి తన స్కిట్స్ తో భీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు వేణు.సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లను పరిచయం చేసింది ఇతనే.! వాళ్ళు సినిమాల్లో బిజీ అయ్యారు అంటే ఓ రకంగా వేణు వల్లనే అని చెప్పాలి.

అటు తర్వాత సినిమాల్లో అడపా దడపా నటిస్తూనే సైలెంట్ గా డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఇటీవల వచ్చిన ‘బలగం’ సినిమాకి ఇతనే దర్శకుడు. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్లో రూపొందిన ఈ మూవీకి దిల్ రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డి లు నిర్మించారు. ఇక నుండి దిల్ రాజు నిర్మించే చిన్న చిత్రాలు అన్నీ ఈ బ్యానర్ పైనే రూపొందుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. ‘బలగం’ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కమర్షియల్ లెక్కలు పెద్దగా లేకపోయినా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో …

కథను నమ్ముకుని తీసిన సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఓ కమెడియన్ అయిన వేణు డైరెక్టర్ గా మారి ఇంత ఎమోషనల్ మూవీ తీస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. ఇతని పనితనానికి దిల్ రాజు ఇంప్రెస్ అయిపోయాడు. ‘బలగం’ షూటింగ్ టైంలోనే దిల్ రాజుకి మరో లైన్ చెప్పాడట వేణు. లైన్ నచ్చడంతో కథ మొత్తం విన్న దిల్ రాజు.. ఈ ప్రాజెక్టు కూడా మనం చేస్తున్నాం అని చెప్పారట.

అలాంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ను మరో సినిమాకి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. బలగం సినిమాని తెలుగు రాష్ట్రాల్లో తన హ్యాండోవర్ లో ఉన్న థియేటర్లలోనే రిలీజ్ చేసుకున్నారు దిల్ రాజు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయట. కాబట్టి అతను సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus