Balagam: కరీంనగర్ జిల్లాలో బలగం క్లైమాక్స్ రిపీట్.. ఏం జరిగిందంటే?
May 27, 2023 / 05:04 PM IST
|Follow Us
ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి చిత్రాలలో బలగం సినిమా ఒకటి. ఈ సినిమాకు ఇలాంటి ఆదరణ వచ్చిందో మనకు తెలిసిందే. బలగం సినిమా చూసి విడిపోయిన ఎన్నో కుటుంబాలు కలిసిపోయాయి. ఈ సినిమా చూసి ఊరు ఊరు మొత్తం కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాము అంతలా ఈ సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపించిందని చెప్పాలి. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం అందరిని కంటతడి పెట్టించిందని చెప్పాలి.
చనిపోయిన కుటుంబ పెద్దకు పిండ ప్రదానం చేసే సమయంలో కాకులు దానిని తింటే వారి ఆత్మ శాంతిస్తుందని లేకపోతే వారి ఆత్మ ఏదో తీరని కోరికతో ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో విడిపోయిన అన్నదమ్ములు అక్క చెల్లెలంతా కలిసి పెట్టినప్పుడే కాకులు వచ్చి తింటాయి అయితే కరీంనగర్ జిల్లాలో కూడా అచ్చం ఇలాంటి ఘటనని చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా జిమ్ముకుంట మునిసిపాలిటీ పరిధిలోని వెంకటరాజ్యం గౌడ్ అనే వృద్ధుడు ఐదు రోజుల క్రితం మరణించారు.
ఈయనకు ముగ్గురు కుమారులు. ఇక వెంకటరాజ్యం గౌడ్ చుట్టుపక్కల ఏడు గ్రామాలకు పెద్దగా వ్యవహరించేవారు. అయితే ఈయన చనిపోయే ఐదు రోజులు కావడంతో కుటుంబీకులు సాంప్రదాయం ప్రకారం పిట్టకు పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తమ తండ్రికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటిని చేసిపెట్టిన కాకి మాత్రం ఆహార పదార్థాలను తాకలేదు. ఈ విధంగా కాకి ఆహార పదార్థాలను ముట్టుకోకపోవడంతో వీరికి బలగం సినిమా క్లైమాక్స్ గుర్తుకు వచ్చింది.
దీంతో తన తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి పేక ముక్కను, పది రూపాయల నోటును ఆ పళ్లెంలో పెట్టి వచ్చారు.ఇలా తన తండ్రికి ఎంతో ఇష్టమైన పేక ముక్క 10 రూపాయలు నోటును ఆ పళ్లెంలో పెట్టడం వల్ల తన తండ్రి ఆత్మ శాంతించి ఉంటుందని ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇలా బలగం సినిమా (Balagam) ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడుతోందని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది.