Balayya Babu: ఆ విషయంలో ఆయనే స్పూర్తి ప్రదాత అంటున్న బాలయ్య!

  • October 6, 2022 / 06:51 PM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్2 షో త్వరలో ప్రసారం కానుండగా ఈ షో ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది సీనియర్ స్టార్ హీరోలు ఈ షోలో కనిపించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంట్లో వసుంధర అన్ స్టాపబుల్ అని వసుంధర నన్ను, నా ఫ్యామిలీని ఎంతో ఓర్పుగా చూసుకుంటుందని బాలయ్య అన్నారు. అమ్మవారిని ప్రతిష్టించి వివిధ రూపాలలో ఆమెను పూజించి దసరా వేడుకలను జరుపుకుంటామని బాలయ్య తెలిపారు.

అందరూ బాగుండాలని ప్రార్థిస్తామని బాలయ్య చెప్పుకొచ్చారు. నాన్నగారి సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏదనే ప్రశ్నకు స్పందిస్తూ ఎన్నో నేపథ్యాల్లో సినిమాలు చేశారని ఆయన ఏ పాత్ర చేసినా అన్ స్టాపబుల్ అని బాలయ్య చెప్పుకొచ్చారు. మీ ఎనర్జీకి కారణం ఏంటనే ప్రశ్నకు నాన్నగారని బాలయ్య సమాధానం ఇచ్చారు. నాన్న నాకు స్పూర్తి ప్రదాత అని బాలయ్య కామెంట్లు చేశారు. నాన్నగారిని తండ్రిగానే కాకుండా గురువుగా, దైవంగా భావిస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్లు అని బాలయ్య కామెంట్లు చేశారు. మనం ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ లా ఉండాలని నాన్న నేర్పించారని బాలయ్య చెప్పుకొచ్చారు. ఎన్బీకే 107 టీమ్ ఇష్టమా అన్ స్టాపబుల్ టీమ్ ఇష్టమా అని బాలయ్యను అడగగా నాకు అందరూ ఇష్టమే అని బాలయ్య తెలిపారు. అన్ స్టాపబుల్ సీజన్2 లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున పాల్గొనే అవకాశాలు అని బాలయ్య వెల్లడించారు.

వాళ్లు అన్ స్టాపబుల్ సీజన్2 లో పాల్గొనేలా టీమ్ ప్రయత్నించాలని బాలయ్య కామెంట్లు చేశారు. అన్ స్టాపబుల్ సీజన్1 ను ఒక సినిమా షూటింగ్ లా ఫీలయ్యానని బాలయ్య తెలిపారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆహా బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుందని బాలయ్య వెల్లడించడం గమనార్హం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus