Balakrishna: ఎఫ్3 మూవీ చూసి బాలయ్య అలా అన్నారా?

  • June 1, 2022 / 07:46 PM IST

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 మూవీ వీక్ డేస్ లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 3వ తేదీన విక్రమ్, మేజర్ సినిమాలు విడుదలవుతున్నా ఎఫ్3 సినిమాకు మాత్రం కలెక్షన్లు తగ్గవని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంటే సుందరానికి సినిమా విడుదలయ్యే వరకు ఎఫ్3 సినిమానే పైచేయి సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ ఎఫ్3 సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ లో చూశారని తెలుస్తోంది.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి కోరిక మేరకు బాలయ్య ఈ సినిమాను వీక్షించారని సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశారని సినిమాలోని కామెడీ సన్నివేశాలను చూసి బాలయ్య కడుపుబ్బా నవ్వారని తెలుస్తోంది. ఎఫ్3 సినిమా ఆయనకు ఎంతో నచ్చిందని బోగట్టా. సినిమా చూసిన తర్వాత బాలయ్య చిత్రయూనిట్ ను ఎంతగానో ప్రశంసించారని తెలుస్తోంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమాను బాలయ్య ప్రశంసించడంతో ఆయా హీరోల అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎఫ్3 సినిమా గురించి బాలయ్య పాజిటివ్ గా మాట్లాడటం గురించి నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు బాలయ్య అనిల్ కాంబో మూవీ సెప్టెంబర్ నెల నుంచి మొదలుకానుంది. ఈ సినిమాను తన శైలికి భిన్నమైన కథతో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. ప్రియమణి, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో సాహో గారపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. బాలయ్య దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా వచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది భావిస్తున్నారు. సినిమాసినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతోంది. అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న బాలకృష్ణ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus