ఇది శాతకర్ణి విజయానికి నాంది!!!

  • January 9, 2017 / 07:45 AM IST

నట సింహం నందమూరి బాల కృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం బాక్స్ ఆఫీస్  ను షేక్ చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది…ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతూ వచ్చాయి…అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగా జరగడంతో నందమూరి అభిమానులు ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు….అయితే అదే క్రమంలో ఈ సినిమా డైలాగ్స్ కూడా ఇరగదీస్తాయి అని బాలయ్య చెబుతున్నారు…విషయంలోకి వెళితే…ఈ నెల 12న శాతకర్ణి విడుదల సందర్భంగా ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా పతాక ఆవిష్కరణ ఉత్సవాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో వంద థియేటర్లలో ఒకేసారి ఈ పతాకోత్సవాన్ని నిర్వహించింది యూనిట్. ఇక విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్ లో పతాక ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ  ప్రత్యేకంగా హాజరయ్యి హంగామా చేశారు.

ఆ వేడుకలో మాట్లాడిన బాలయ్య ఇది కేవలం పతాక ఆవిష్కరణ కాదని.. శాతకర్ణి విజయానికి నాంది అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు బాలయ్య. ఇక అభిమానులకు మరింత ఉత్సాహం నింపేలా ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను బాలయ్య చెప్పారు…’ఇక్కడ మా ఇంట్లో గదికి గోడలుంటాయి.. గొడవలుంటాయి.. ఇది మా ఇల్లంటూ కొట్టుకుంటా.. కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం.. సరిహద్దుల్లో స్మశానం నిర్మిస్తాం. మీ మొండేలా మా జెండాని ఎగరేస్తాం’ అంటూ బాలకృష్ణ ఆవేశంగా చెప్పిన డైలాగ్ కి ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. ఇలాంటి  డైలాగులు ఇంకెన్నో సినిమాలో ఉంటాయని.. సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుందని చెబుతూనే….’మిత్రమా 12న చిత్రం విడుదల కాబోతోంది’ అంటూ తన ప్రసంగాన్ని ముగించడంతో అక్కడ ప్రాంగణం అంతా…జై బాలయ్య నినాదంతో దద్దరిల్లింది…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus