Balakrishna: బాలయ్య కూతురు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా.. ఎన్నికల్లో పోటీ చేస్తారా?

  • July 25, 2023 / 09:00 AM IST

స్టార్ హీరో బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకున్న ఎంటర్టైన్మెంట్ తో పాటు బాలయ్య ఫ్యాన్స్ మెచ్చే యాక్షన్ సీన్లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడగా బాలయ్య బాబీ కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉండనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. స్టార్ హీరో బాలయ్య కూతురు బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బ్రాహ్మణి వ్యాపారవేత్తగా కూడా అంచనాలకు మించి సక్సెస్ అయ్యారు. అయితే బాలయ్య కూతురు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని రాజకీయాల్లో సక్సెస్ అయ్యే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హిందూపురం నుంచి బ్రాహ్మణి పోటీ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ బ్రాహ్మణి హిందూపురం నుంచి నిజంగా పోటీ చేస్తే మాత్రం బాలయ్య (Balakrishna) ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది.

బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే అక్కడ కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బ్రాహ్మణికి కెరీర్ పరంగా కలిసిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా త్వరలో ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. నిర్మాతలకు ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభాలను అందిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus