స్టార్ హీరో బాలయ్య అఖండ సినిమా సక్సెస్ తో 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న హీరోలలో ఒకరిగా నిలిచారు. బాలయ్య నటన, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, క్వాలిటీతో తెరకెక్కిన సన్నివేశాలు ఈ సినిమా సక్సెస్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాయి. అయితే అఖండ సక్సెస్ ఇచ్చిన జోష్ లో బాలయ్య ఏకంగా ఏడుమంది డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
బాలయ్యతో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లలో యంగ్ జనరేషన్ డైరెక్టర్లతో పాటు స్టార్ డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమాలతో పాటు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ సైతం బాలయ్య కోసం కథను సిద్ధం చేశారని బోగట్టా. కొరటాల శివ, పరశురామ్, వెంకీ అట్లూరి కూడా బాలయ్య తర్వాత సినిమాల డైరెక్టర్ల జాబితాలో ఉన్నారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి బాలయ్య పుట్టినరోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలయ్య పారితోషికం తక్కువే కావడంతో నిర్మాతలు సైతం బాలయ్యతో సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్2 ప్రసారం కావాల్సి ఉండగా ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్2 కోసం భారీ మొత్తం డిమాండ్ చెస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!