ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత సినిమాకి ఓకే చెప్పిన బాలకృష్ణ
September 19, 2018 / 07:22 AM IST
|Follow Us
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న డైరక్టర్ అనిల్ రావిపూడి… ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. F2 అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఇందులో విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. అందుకే నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు.
అదే విధంగా సంక్రాంతికి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో రంగంలోకి దిగుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ యువ డైరక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. కథ వినిపించడం.. ఓకే చెప్పడం అంతా జరిగిపోయాయట. పూరి, బాలకృష్ణ ప్రాజక్ట్ మాదిరిగా.. వీరిద్దరి కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్షన్ లో కామెడీ మిక్స్ చేసి బాలయ్య అభిమానులకు పూర్తి వినోదాన్ని అనిల్ రావిపూడి అందించడం ఖాయం.