‘ఎన్టీఆర్’ చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేసిన మాజీ ముఖ్యమంత్రి..!
December 29, 2018 / 01:37 PM IST
|Follow Us
నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ ఫిబ్రవరి 7 న విడుదలకబోతుంది. ఇదిలా ఉండగా ‘ఎన్టీఆర్- బయోపిక్’ కు ఊహించని పరిణామం ఒకటి ఎదురయ్యింది.
వివరాల్లోకి వెళితే ఎవరూ.. ఊహించని విధంగా సీన్ లోకి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఎంటరయ్యారు. ‘ఎన్టీఆర్- బయోపిక్’ లో తనను ఏ మాత్రం నెగిటివ్గా చూపించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాదెండ్ల హెచ్చరించారు. తాజాగా నాదెండ్లభాస్కర్ రావు ఓ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్ర యూనిట్ కు ఇప్పటికే రెండు దఫాలుగా నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. ఈ చిత్రంలో తన గురించి తప్పుగా చూపించే ప్రయత్నం జరగొచ్చని.. అలా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటానంటూ తెలిపారు. ‘ఎన్టీఆర్’ జీవితం పేరుతో తన పై దుష్ప్రచారానికి వస్తే మాత్రం చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. విడుదలకు ముందే ఇలాంటి నోటీసులు వస్తే… చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో… అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.