ఎన్నో ఏళ్ల తర్వాత ‘సింహ’తో విజయం అందుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. తర్వాత మళ్ళీ ‘లెజెండ్’తో దాన్ని మించిన సక్సెస్ అందుకున్న ఆయన ‘లయన్’ సినిమాతో ఓ అడుగు వెనక్కి వేసి ‘డిక్టేటర్’ తో విజయబావుటా ఎగురవేశారు. ప్రస్తుతం వందో చిత్రంగా చేస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో ఆ సక్సెస్ కొనసాగుతుందనే నమ్మకంతో ఉన్న బాలయ్య ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టి అభిమానులను ఖుషీలో ముంచెత్తనున్నారు.
వందో సినిమాకి కథలు వింటున్న సమయంలో బాలయ్య చెవినపడ్డ కథల్లో ‘రైతు’ ఒకటి. వాస్తవానికి ఇదే ఆ మ్యాజిక్ నెంబర్ పక్కన ఉండాల్సుంది. అయితే తెలుగు చక్రవర్తి కథ అన్న కారణంతో బాలయ్య క్రిష్ కథకు ఓటేశారు. బాలకృష్ణను అంతలా మెప్పించిన రైతు కథ సాక్షి ఫీచర్స్ ఎడిటర్ రామ్ రాశారు. తాజాగా ఈ కథను బాలయ్య 101 సినిమా నిర్మాతలైన 14 రీల్స్ వారు విన్నారట. మారు మాట లేకుండా విజయ ధీమా వ్యక్తం చేశారట. ఇక కృష్ణవంశీ తన క్రియేటివిటీతో దీన్ని మరోస్థాయికి తీసుకెళ్తారన్నది అనుమానం లేని విషయం. అలా డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, రైతు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారు బాలయ్య.