Balakrishna: బోయపాటిపై అభిమానంతో ఆ పని చేయనున్న బాలయ్య.. ఏం జరిగిందంటే?

  • August 24, 2023 / 12:37 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఎవరికైనా మాట ఇచ్చారంటే ఆ మాటను కచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మరో 20 రోజుల్లో రామ్ బోయపాటి కాంబో మూవీ స్కంద థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య హాజరైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

త్వరలో ఈ సినిమా ఈవెంట్ జరగనుంది. తనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుపై అభిమానంతో బాలయ్య ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు. మరోవైపు స్కంద సినిమాలో, బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ ఈవెంట్ కు బాలయ్య హాజరు కావడం వల్ల బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాపై కూడా అప్ డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ 2024 ఎన్నికల తర్వాత మొదలుకానుందని సమాచారం. తన సినిమాలో బాలయ్యను డ్యూయల్ రోల్ లో చూపించడానికి బోయపాటి శ్రీను ఎక్కువగా ఇష్టపడతారు.

రాబోయే రోజుల్లో బాలయ్య (Balakrishna) మల్టీస్టారర్ సినిమాలపై దృష్టి పెట్టనున్నారని కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో బాలయ్య నటించనున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు బాలయ్య మార్కెట్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమాను ఫ్యాన్స్ ఆశిస్తుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus