Unstoppable2: అన్ స్టాపబుల్2 పై అంచనాలు పెంచడానికి బాలయ్య ప్లాన్ ఇదే!

  • October 2, 2022 / 10:59 AM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్2 త్వరలో ఆహా ఓటీటీలో ప్రసారం కానుందనే సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్1 అంచనాలకు మించి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ షో నిర్వాహకులు సీజన్2 కు బడ్జెట్ ను పెంచడంతో పాటు మరింత గ్రాండ్ గా ఈ షో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ సీజన్2 లో ప్రేక్షకుల ఊహలకు అందని గెస్ట్ లు హాజరు కానున్నారని తెలుస్తోంది.

అయితే అన్ స్టాపబుల్2 కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. విజయవాడలో భారీ బహిరంగ సభగా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రోమో షూట్ పూర్తైంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన ప్రశాంత్ వర్మ హైదరాబాద్ లోని వేర్వేరు స్టూడియోలలో ప్రోమోను షూట్ చేశారు. ఫస్ట్ సీజన్ కోసం వర్క్ చేసిన టెక్నీషియన్లు ఈ సీజన్ కు కూడా పని చేయనున్నారు.

విజయవాడలో జరిగే ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారని దాదాపుగా 30,000 మంది బాలయ్య అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్2 మొదలైతే ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఓటీటీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఈవెంట్ తో అన్ స్టాపబుల్ సీజన్2 పై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

అన్ స్టాపబుల్ సీజన్2 ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు, లోకేశ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారని ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ను ఊహించని స్థాయిలో ప్లాన్ చేశారని బోగట్టా. టీడీపీ అభిమానులను ఆకట్టుకునేలా ఎన్నో ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చేలా ఈ ఎపిసోడ్ ఉండనుంది. ఆహా ఓటీటీకి ఈ షో ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దసరా పండుగ ముందురోజున విజయవాడలో ఈ ఈవెంట్ జరగనుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus