అసలే ఎన్టీఆర్ కథానాయకుడు & మహానాయకుడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అనే బాధకంటే.. ఆ సినిమాల కారణంగా డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇవ్వాల్సిన మొత్తం పెరిగిపోయింది అనే బాధ బాలయ్యను ఇబ్బందిపెడుతుంటే.. ఇప్పుడు డిసెంబర్ 20న “రూలర్” రిలీజ్ అవుతుండగా.. ఒక వారం ముందు అనగా డిసెంబర్ 13న “వెంకీ మామ” రిలీజ్ అవుతుండడం.. మళ్ళీ డిసెంబర్ 20న “ప్రతిరోజు పండగే” విడుదలకానుండడం బాలయ్య నిర్మాతలను భయపెడుతుంది.
నిజానికి రూలర్ కంటే వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాలకే మంచి క్రేజ్ ఉంది. దాంతో బాలయ్య సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ భారీ మొత్తానికి ఆ సినిమా కొనడానికి ఆసక్తి చూపడం లేదు. అందులోనూ విడుదలైన టీజర్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం ఇందుకు కారణం. మరి ఈ పోటీ మధ్యలో బాలయ్య నెగ్గుకోస్తాడా లేదా అనేది మరో 15 రోజుల్లో తెలిసిపోతుందనుకోండి.