Balarkishna: ఆ వ్యక్తి సైలెంట్ అయ్యాడంటున్న బాలకృష్ణ!
February 5, 2022 / 01:01 PM IST
|Follow Us
స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాకు ముందు వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అఖండ సక్సెస్ బాలయ్య అభిమానులకు సంతోషాన్ని కలిగించడంతో పాటు యువతలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచింది. మరోవైపు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో హీరోగా బాలయ్య క్రేజ్ ను, స్థాయిని ఊహించని స్థాయిలో పెంచడం గమనార్హం. ఈ షో సీజన్1 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఒక విషయంలో మహేష్ పై కోపం ఉందని బాలయ్య మహేష్ బాబుతో అన్నారు.
కనీసం పెళ్లికి కూడా తనను పిలవలేదని వెకేషన్ అని చెప్పి మహేష్ పెళ్లి చేసుకున్నాడని బాలయ్య మహేష్ బాబుతో చెప్పుకొచ్చారు. నాన్నకు నమ్రతను పెళ్లి చేసుకుంటానని చెప్పిన వెంటనే ష్యూరా అని అడిగారని తాను ష్యూర్ అని చెప్పగా నాన్న నమ్రతతో మాట్లాడి పెళ్లికి అంగీకరించారని మహేష్ చెప్పుకొచ్చారు. నమ్రతతో మ్యారేజ్ ప్రైవేట్ గా జరిగిందని ప్రస్తుతం సంతోషంగా ఉన్నామని మహేష్ తెలిపారు. నాపై సెటైర్లు వేస్తే రిటైర్ కావాల్సిందేనని మహేష్ బాబు కామెంట్లు చేశారు.
నాన్నది టెర్రిఫిక్ మెమొరీ అని మహేష్ వెల్లడించారు. కేబీఆర్ పార్క్ లో పామును చూసి మళ్లీ ఆ పార్క్ కు వెళ్లలేదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. నేను కేబీఆర్ పార్క్ కు ఉదయం నాలుగున్నరకు వెళ్లేవాడినని తలుపులు ఐదున్నరకు తెరుస్తారు కాబట్టి గోడ దూకి వెళ్లేవాడినని బాలయ్య వెల్లడించారు.
చీకట్లో ముఖం కనిపించకపోవడంతో తలుపులు తెరిచిన వ్యక్తి దెయ్యం దెయ్యం అని అరిచేవాడని దెయ్యం కాదురా నేను బాలకృష్ణను అని చెబితే మీరా సార్ ఎలా వచ్చారు సార్ అని అన్నాడని బాలయ్య పేర్కొన్నారు. ఎందుకు సార్ గోడ దూకి వచ్చారని ఆ వ్యక్తి అడగగా నా టైమింగ్ కు నువ్వు ఓపెన్ చెయ్యి అని చెబితే ఆ వ్యక్తి సైలెంట్ అయ్యేవాడని బాలయ్య తెలిపారు.