Sp Balasubrahmanyam: హాట్ టాపిక్ గా మారిన ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం ఆస్తుల వార్తలు..!
August 5, 2021 / 05:22 PM IST
|Follow Us
గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారు గతేడాది ఎవ్వరూ ఊహించని విధంగా కరోనాతో పోరాడి మరణించిన సంగతి తెలిసిందే. 40 రోజుల పాటు ఆయన కరోనాతో ఫైట్ చేసి తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయి ఏడాది పూర్తి కావస్తున్నా .. సంగీత ప్రియులు ఇంకా ఆ వార్తని జీర్ణం చేసుకోలేక పోతున్నారనే చెప్పాలి. ఆయన పాడిన అద్భుతమైన పాటల రూపంలో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆస్తులు అమ్మేస్తున్నారు
అంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కొన్ని సినిమాలను నిర్మించి నష్టపోయిన కారణంగా.. ఆ అప్పులు తీర్చడం కోసం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు సంపాదించిన ఆస్తులను అమ్మేస్తున్నట్టు ఈ వార్త సారాంశం. తాజాగా ఈ విషయాల పై ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “నాన్నగారి ఆస్తులు నేను అమ్ముకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నా సినిమాలు, నా అప్పులు, నా నష్టాలు కారణంగా నాన్నగారి ఇమేజ్ ని నేను ఎప్పుడూ డ్యామేజ్ చేయలేదు, చేయను కూడా.!
సినిమాల్లో నష్టాలు వచ్చాయని నాన్న గారి పై వాటి భారాన్ని మోపలేదు. నా అప్పులని తీర్చడానికి నేను ఇతర మార్గాలను నమ్ముకున్నాను” అంటూ చరణ్ చెప్పుకొచ్చారు.అయితే ఈ వార్తలు రావడం వెనుక కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కోదండపాణి స్టూడియోస్ ను ఎస్పీ చరణ్ ఇటీవల అమ్మేసినట్టు తెలుస్తుంది. స్టూడియోల్లో రికార్డింగ్స్ తగ్గిపోయాయి కాబట్టి ..అక్కడ పని చేసే స్టాఫ్ కు ఏ పని లేకపోవడంతో దానిని అమ్మేసారని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ఎస్పీ చరణ్ తన తండ్రి ఎస్పీ బాలు ఆస్తులు అమ్మేస్తున్నారంటూ ప్రచారం మొదలయ్యింది.