Balakrishna, Prabhas: ఆ షోలో రెబల్ స్టార్ సందడి చేస్తారా?

  • December 9, 2021 / 07:55 AM IST

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ షోకు గెస్ట్ గా హాజరు కాగా త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ షోకు రాబోయే స్టార్స్ జాబితాలో ప్రభాస్ కూడా ఉన్నారని సమాచారం. స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా వచ్చే నెల 14వ తేదీన రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటికే ప్రభాస్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాలయ్య ప్రభాస్ ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. గెస్టులతో ముచ్చట్లు చెప్పించడంతో పాటు బాలయ్య కూడా ఈ షోలో తన గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను తెలిసేలా చేస్తున్నారు. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ప్రభాస్ ను ఆహ్వానించినా ఆ షోకు రావడానికి ప్రభాస్ ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చాయి.

త్వరలోనే ఆహా టీమ్ నుంచి ప్రభాస్ ఈ షోకు వస్తారో రారో క్లారిటీ రానుంది. ఆహా ఓటీటీలో ఇతర షోలతో పోలిస్తే అన్ స్టాపబుల్ షో ఎక్కువగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus