Balakrishna: హరికృష్ణ కోసం బాలకృష్ణ ఈ సినిమా ఎందుకు చేశాడంటే..?

  • November 16, 2022 / 10:58 AM IST

ఒక సినిమా కథ విన్నప్పుడు, లేదా షూటింగ్ జరుగుతున్నప్పుడు, రష్, ఔట్‌పుట్ చూసినప్పుడు దర్శకనిర్మాతలకి ఇది ఆడుతుంది.. ఆడదు అనేది తెలిసిపోతుంది. ఒకోసారి అంచనాలు తలకిందులవచ్చు.. పోతుంది అని తెలిశాక కూడా సినిమా చేశారంటే అది కచ్చితంగా మెహమాటం, కమిట్‌మెంట్ అయ్యే ఉంటుంది. అలా తమకీ జరిగిందని కొంతమంది స్టార్స్ మీడియా ముందు చెప్పిన సంఘటనలు మనం చూశాం.. అలాంటి అనుభవం నటసింహం నందమూరి బాలకృష్ణకు కూడా ఓసారి ఎదురైందట.

కథ తేడాగా ఉంది, నేను చేస్తే చూస్తారో లేదోననే సందేహం ఉన్నా కానీ చెయ్యక తప్పలేదంట.. ఇంతకీ.. ఏంటా కథ? ఏదా చిత్రం.. ఇప్పుడు చూద్దాం..బాలయ్య కెరీర్‌లో 80ల్లో సాలిడ్ సినిమాలొచ్చాయి.. మాస్, క్లాస్, ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యే చిత్రాలు చేశాడు. వాటిలో ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’ అనే సినిమా ఆడదు అని ముందుగానే తెలిసినా కానీ చెయ్యక తప్పలేదట. ఎ.కోదండ రామి రెడ్డి దీనికి దర్శకుడు.

తేజస్వి ప్రొడక్షన్స్ బాలయ్య అన్నయ్య నందమూరి హరికృష్ణ నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు రాశారు. బాలయ్య మరో అన్నయ్య నందమూరి మోహన కృష్ణ (తారకరత్న తండ్రి) కెమెరామెన్. భానుప్రియ కథానాయిక. ‘యువకిశోరం’ బాలకృష్ణ ఈ మూవీలో రవితేజ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఇన్‌‌స్పెక్టర్ క్యారెక్టర్ చేశాడు. 1988 మే 11న విడుదలైంది.కట్ చేస్తే… బాలయ్య అనుకున్నదే అయ్యింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది..

ఫలితం ముందుగాను తెలిసినా అసలు బాలయ్య ఈ యాక్షన్ ఫిల్మ్‌కి ఎందుకు ఓకే చెప్పాడంటే.. అన్నయ్య హరికృష్ణకి ఈ కథ మీద, దర్శకుడు కోదండ రామి రెడ్డి మీద బాగా నమ్మకం ఉందట.. మొదట బాలయ్య వద్దని వారించినా.. ఆయన అంతగా చెప్పడంతో అన్నయ్య మాటకు అడ్డు చెప్పలేక బాలయ్య ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’ చెయ్యాల్సి వచ్చింది. రిజల్ట్ ముందే గ్రహించానని, తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చిందని స్వయంగా బాలయ్యే చెప్పడం విశేషం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus