బాలయ్య మళ్ళీ ఓల్డ్ లుక్ లోకి వచ్చేశాడుగా..!

  • April 3, 2020 / 04:00 PM IST

చాల కాలం తరువాత బాలకృష్ణ ఓ కొత్త అవతారంలో కనిపించారు. కొద్దిరోజులుగా ఆయన గుండు మరియు తెల్ల గడ్డంలో కనిపించారు. ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారని కొందరు అంటే..లేదు బోయపాటి సినిమాలో ఓ లుక్ కోసం ఆయన అలా మారారు అని మరికొందరు అన్నారు. కారణం ఏదైనా బాలయ్య కొన్నాళ్లు కొత్తగా కనిపించారు. తన అందం పై అమితమైన శ్రద్ద చూపే బాలయ్య జుట్టు తగ్గాక విగ్ లేకుండా కనిపించింది లేదు.

చివరికి ఫ్యామిలీ వేడుకలకి కూడా బాలయ్య విగ్ లోనే హాజరయ్యేవారు. ఇక పబ్లిక్ వేడుకలలో విగ్ అనేది కంపల్సరిగా ధరించేవారు. ఇటీవల కొన్నాళ్లుగా విగ్గు లేకుండా నాచురల్ లుక్ లో తిరిగిన బాలయ్య పూర్వపు లుక్ లోకి వచ్చేశారు. కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం బాలకృష్ణ ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ చెక్ ను సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ కి అందజేయడానికి వచ్చిన బాలయ్య మునుపటి మాదిరి విగ్ ధరించి కనిపించారు.

వైట్ షర్ట్, జీన్ ప్యాంటు లో ఉన్న బాలయ్య మునుపటి కంటే బెటర్ లుక్ కలిగి వున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తారని టాక్. అలాగే అందులో ఓ లుక్ నందు ఆయన అఘోరాగా కనిపిస్తారని తెలుస్తుంది. ఈ మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus