నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఆరుగురు నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ లు ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, హారిక హాసిని ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు బాలయ్యతో సినిమా చేయబోతున్నారు. వెయిటింగ్ లిస్ట్ లో మరికొంతమని నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా తరువాత సినిమా.. లేదంటే ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు బాలయ్య.
ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇది పూర్తయిన తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయాలి బాలయ్య. కానీ ఇప్పుడు తన ఆలోచన మార్చుకొని పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ‘పైసా వసూల్’ తరువాత బాలయ్యతో మరో సినిమా చేయాలని పూరి అనుకున్నారు.
బాలయ్య కూడా ఓకే చెప్పారు. ఫైనల్ గా ఇప్పటికి ఈ కాంబో రిపీట్ కానుంది. రీసెంట్ గా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో కూడా పూరి సినిమా కన్ఫర్మ్ చేశారు. నిజానికి అనిల్ రావిపూడి సినిమాను ముందుగా చేయాలి కానీ ఇంకా కథ ఫైనల్ కాలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి పూరితో సినిమాకి రెడీ అవుతున్నారు. కథల విషయంలో పూరి చాలా స్పీడ్ గా ఉంటారు. ఒక రోజులోనే కథ రాసేసుకుంటారు. ప్రస్తుతం ఆయన దగ్గర బాలయ్యకి తగ్గ లైన్లు రెడీగా ఉన్నాయి. అందుకే రావిపూడి కంటే ముందు పూరితో సినిమా చేయాలనుకున్నారు.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!