Balayya Babu: బాలయ్య మూవీపై రూమర్లలో అసలు సంగతి ఇదే.. ఏమైందంటే?

  • August 15, 2023 / 05:36 PM IST

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హరికృష్ణ నటించిన స్వామి సినిమాకు రీమేక్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరికృష్ణ, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్వామి సినిమాకు వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.

ఆ సినిమాకు భగవంత్ కేసరి రీమేక్ అని ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ కామెంట్ల వల్ల సినిమాకు నష్టం కలిగే అవకాశం ఉండటంతో చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. భగవంత్ కేసరి స్ట్రెయిట్ మూవీ అని ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్, కాపీ కాదని చిత్రయూనిట్ వెల్లడించింది. అక్టోబర్ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాలయ్య నట విశ్వరూపం చూపిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లు కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్యను (Balayya Babu) అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus