నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ అనతికాలంలోనే బడా నిర్మాతగా ఎదిగారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. అతను నిర్మించిన గబ్బర్ సింగ్, టెంపర్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. రెండేళ్లు గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన ఓ మూవీ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న మూవీ గురించి మాట్లాడుతూ బండ్ల గణేష్ నోరు జారారు. స్వీటీ అనుష్క రెమ్యునరేషన్ గురించి బయటి పెట్టి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం వివరాలను నిర్మాతలు బయటికి చెప్పరు.
అటువంటిది దక్షిణాది టాప్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని చెప్పి సంచలనం సృష్టించారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఆశ్చర్యపోతుంటే.. అభిమానులు మాత్రం హీరోలతో సమానంగా స్వీటీ పారితోషికం అందుకుంటుందని సంబరపడిపోతున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ నెక్స్ట్ ప్రాజక్ట్ లో అనుష్క ఉందా? లేదా? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.