Bandla Ganesh: బండ్లన్న రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనా…ఇలా క్లారిటీ ఇచ్చారా!
May 15, 2023 / 08:28 PM IST
|Follow Us
బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ గతంలో రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నానని ప్రకటించారు. ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేష్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
గత రెండు రోజుల క్రితం ఈయన తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నానని నీతిగా నిజాయితీగా పొగరుగా రాజకీయాలు చేస్తాను అంటూ రాజకీయాలలోకి తిరిగి రావడం గురించి చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.అయితే బండ్ల గణేష్ రాజకీయాలలోకి కనుక వస్తే ఏ పార్టీకి తన మద్దతు ప్రకటిస్తారు అనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.బండ్ల గణేష్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఈయన పవన్ కళ్యాణ్ తన దైవంగా భావిస్తూ మాట్లాడుతూ ఉంటారు.
అంతేకాకుండా మెగా ఫ్యామిలీని ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా వారికి తన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ నుదైవంగా భావించే బండ్ల గణేష్ తప్పకుండా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతారని కొందరు భావిస్తున్నారు అయితే తాజాగా ఈయన మదర్స్ డే సందర్భంగా చేసిన పోస్ట్ కనుక చూస్తే ఈయన కాంగ్రెస్ పార్టీ వైపే అడుగులు వేసేలా ఉన్నారని తెలుస్తోంది.
మే 14 మదర్స్ డే సందర్భంగా బండ్ల గణేష్ (Bandla Ganesh) సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫోటోని షేర్ చేయడమే కాకుండా మదర్ ఆఫ్ తెలంగాణ ఆటో సోనియాగాంధీ ఫోటోని షేర్ చేయడంతో ఈయన రాజకీయాలలోకి తిరిగి వచ్చిన తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని పలువురు భావిస్తున్నారు.మరి రాజకీయాలలోకి తిరిగి ఎంట్రీ ఇస్తున్న బండ్లన్న ఏ పార్టీ వైపు నిలబడి ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో తెలియాల్సి ఉంది.