తాను చేసిన తప్పుని మీడియా ముందు ఒప్పుకున్న బండ్ల గణేష్!
November 17, 2017 / 01:17 PM IST
|Follow Us
నటుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి నిర్మాతగా ఎదిగిన వ్యక్తి సచిన్ జోషి. స్టార్ హీరోలతో హిట్స్ అందుకున్న ఈ నిర్మాత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర సంగతులు చెప్పారు. సచిన్ జోషికి తన బ్యానర్ ని అరువుగా ఇవ్వడమే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పుగా అభివర్ణించారు. వివరాల్లోకి వెళితే.. ‘నీ జతగా నేనుండాలి’ అనే చిత్ర విషయంలో నిర్మాత బండ్ల గణేష్‌కు, హీరో సచిన్ జోషీకి మధ్య విభేదాలు వచ్చాయి.
ఒకరికొకరు మీడియా ముందు తిట్టుకున్నారు. అసలు జరిగిన విషయం ఏమిటని అడగగా బండ్ల గణేష్ ఇలా చెప్పుకొచ్చారు. “నీ జతగా నేనుండాలి” అనే సినిమా ఎందుకు చేశానా? అని ఇప్పటికీ బాధపడుతుంటాను. వాస్తవానికి ఆ సినిమా నేను చేయలేదు. నా బ్యానర్ మీద చేసుకుంటానంటే ఇచ్చానంతే. ఆ సినిమాలో నటించిన సచిన్ ఎవరో కూడా నాకు తెలియదు. నా స్నేహితుడి రిక్వెస్ట్‌ని కాదనలేక, నా బ్యానర్లో ఆ సినిమా తీయడానికి అంగీకరించాను. ఈ సినిమాకి నేను ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. మొత్తం సచినే పెట్టుకున్నాడు. కానీ సినిమా ఆడకపోయే సరికి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన తీసుకున్న సినిమాకి నష్టం వస్తే నా మీదే మళ్లీ కోర్టులో కేసు వేశాడు. నాపై పిచ్చి కామెంట్లు చేశాడు.
అందుకే అతనిపై పరువు నష్టం దావా వేశా. ఇప్పటికీ ఈ విషయంలోనే బాధపడుతుంటాను. నా జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది ఇదే అని భావిస్తుంటాను” అంటూ అసలు విషయం చెప్పారు. మరి బండ్ల గణేష్ చెప్పిన విషయాలు నిజమంటారా? అతను కొత్త విషయాలు చెబుతారా? కొద్దీ రోజుల్లోనే తెలుస్తుంది.