బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో? ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడినా, ట్వీటినా సంచలనమవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ వేశాడు. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కే అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మీకు మా అయ్య ఎవరో తెలవదు.. మా తాత ఎవరో తెలవదు.. ఎవ్వడూ తెలవదు.., రెండేళ్లవుతోంది సినిమా రిలీజై.. ఆ ముందు రిలీజైన సినిమా పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు..అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా” అంటూ విజయ్ దేవరకొండ మాస్ స్పీచ్ ఇచ్చాడు.
విజయ్ వాడిన ఆ డైలాగ్ కు కౌంటర్ గానే బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశాడు అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి.ఇటీవల బండ్ల గణేష్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. “పూరి జగన్నాథ్.. పెద్ద డైరెక్టర్ కదా సర్, వాళ్ళ అబ్బాయికి మీరు గాడ్ ఫాదర్ ఉన్నాడు కదా.కానీ వాళ్ళ అబ్బాయికి ఇంకా సక్సెస్ రాలేదు.. వస్తుంది. కానీ ఈరోజు వరకు రాలేదు. కానీ మాతో పాటు కష్టాలు పడి మాతో పాటు జర్నీ చేశాడు చూడండి.. ఆ అబ్బాయి ఈరోజు సూపర్ స్టార్.. అతను విజయ్ దేవరకొండ.
వాళ్ళ నాన్న గోవర్ధనరావు అని మా ఫ్రెండ్. ఇక్కడ కష్టపడే వాడికే అన్నం సార్. కష్టపడే వాడిదే భవిష్యత్తు. టాలెంట్ ఉన్నోడిదే జీవితం. టాలెంట్ లేకుండా పలానా వాళ్ళ అబ్బాయిని. పలానా వాళ్ళ అమ్మాయిని అంటే కుదరదు. ఒక సినిమాకి కుదరుద్ది, రెండో సినిమాకి కుదరుద్ది, మూడో సినిమాకి ఇంట్లో కూర్చోవాల్సిందే. గాడ్ ఫాదర్ అవసరమే లేదిక్కడ..” అంటూ చెప్పుకొచ్చాడు.అలాంటప్పుడు బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేసుండొచ్చు?
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!