నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే.. దేని గురించి మాట్లాడినా సంచలనమే.. పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటాడాయన. ప్రపంచ నలుమూలలా జరిగే ఏ విషయం గురించి అయినా తన స్పందన తెలియజేస్తుంటాడు. ఇప్పుడు బండ్ల గణేష్, తాను రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ బండ్ల ఏమన్నాడంటే..‘‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో..
వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ .. నాకున్న పనులు వల్ల, వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ.. మీ బండ్ల గణేష్’’.. అని ట్వీట్ చేశాడు.
‘మంచి నిర్ణయం తీసుకున్నావన్నా’ అంటూ నెటిజన్ల నుండి, బండ్ల అభిమానుల నుండి ఈ ట్వీట్‌కి భారీ స్పందన వస్తోంది. కాగా, బండ్ల గణేష్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఏకంగా ‘సరిలేరు నీకెవ్వరు’ లో తన మాటల్ని తనే డైలాగ్‌గా చెప్పేంత పాపులర్ అయ్యాయి ఆ వ్యాఖ్యలు..
బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘డేగల బాబ్జీ’ సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు కానీ ఓటీటీలో మాత్రం అందుబాటులో ఉంది. రాజకీయాలకు ఇప్పుడు గుడ్‌బై చెప్పి, వచ్చే ఎన్నికలప్పుడు మనసు మార్చుకున్నాను అని మాట మార్చకుండా ఉంటాడా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మళ్లీ నిర్మాతగానో, ఆర్టిస్టుగానో సినిమాలు చేసినా చెయ్యొచ్చు.. ఏదేమైనా ఈ వీకెండ్ బండ్ల న్యూస్ టాపిక్ అయ్యాడు..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!